Cucumber Seeds: దోసకాయ గింజలు పడేస్తున్నారా.? ఇది తెలిస్తే ఇకపై ఆ పని చేయరు

Cucumber Seeds
x

Cucumber Seeds: దోసకాయ గింజలు పడేస్తున్నారా.? ఇది తెలిస్తే ఇకపై ఆ పని చేయరు

Highlights

Cucumber Seeds: దోసకాయ అనగానే మనకు ముందుగా కీర దోస గుర్తొస్తుంది. కానీ కూర దోసకాయలో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని మీకు తెలుసా.? సహజంగా మనం ఈ దోసలో ఉండే గింజలను పడేస్తుంటాం.

Cucumber Seeds: దోసకాయ అనగానే మనకు ముందుగా కీర దోస గుర్తొస్తుంది. కానీ కూర దోసకాయలో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని మీకు తెలుసా.? సహజంగా మనం ఈ దోసలో ఉండే గింజలను పడేస్తుంటాం. అయితే వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దోస గింజలను ఎండబెట్టి స్నాక్స్ రూపంలో తీసుకుంటే కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* దోసకాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కణాలను రక్షించి, క్యాన్సర్‌, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటును సమతుల్యం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచి, సాధారణంగా కొట్టుకునేలా చేస్తాయి.

* ఈ విత్తనాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఈ పోషకాలు ఎముకల సాంద్రతను మెరుగుపరిచి, ఆస్టియోపోరోసిస్‌ను నివారించడంలో సహాయపడతాయి.

* బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి తీసుకోవడం ద్వారా మలబద్ధకం తగ్గి, విరేచన ప్రక్రియ సులభంగా జరుగుతుంది. అలాగే, గ్యాస్‌, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విత్తనాల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం హైడ్రేట్ అవుతుంది. శరీర జీవక్రియలను మెరుగుపరిచి, ఉష్ణోగ్రతను సంతులితం చేయడంలో సహాయపడతాయి.

* దోసకాయ విత్తనాల్లో విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ, తేమతో నిండిపోతుంది. విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్‌ను నివారించి, చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి.

* దోసకాయ విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. జింక్ వల్ల తెల్ల రక్తకణాలు బాగా అభివృద్ధి చెంది, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి.

నోట్‌: ఈ వివరాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories