మిరప ఘాటు మంచిదే అంట..

మిరప ఘాటు మంచిదే అంట..
x
Highlights

మిరప ఘాటు మంచిదే అంట.. మిరప ఘాటు మంచిదే అంట.. మిరప ఘాటు మంచిదే అంట..

కూర కాస్త స్పైసిగా ఉండడాలంటే దానికి మిరప ఘాటు తగాల్సిందే. అయితే మిరుపకాయలు ఘాటునే కాదు మన ఆయష్షును కూడా పెంచుతాయని అధ్యయనాలు తేల్చాయి. కారంతో అధిక బరువు సమస్య నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మిరుపకాయలపై అమెరికా శాస్త్రవేత్తలు ఇటవలే పలు పరిశోధనలను నిర్వహించారు. మనం తినే అహరంలో ఓ మోతాదులో మిరుపకాయలను తినడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు వివరించారు.

ఈ పరిశోధనల్లో భాగంగా 16వేల మంది మీద సుమారు 23 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. వారి ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య స్థితిని పరీక్షిస్తూ వచ్చారు. పండుమిరపకాయలను ఎక్కువగా తిసుకునే వారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు గుర్తించిగా, తక్కువ తీసుకునే వారిలో గుండెపోటు వంటి సమస్యలు ఉన్నట్లుగా తేలింది. కారం ఎక్కువ తినడం వల్ల దీర్ఘాయుష్షును పోందవచ్చనే విషయం ఈ పరిశోధనల్లో స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు మాత్రం దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్, డీహైడ్రోక్యాప్సైసిన్‌లు గ్లూకోజ్ శాతాన్ని నియంత్రిస్తాయి. శరీరంలోని ఇన్సులిన్ స్థాయి స్థిరంగా ఉంచి రక్త నాళాల్లో పేరుకుపోయి ఉన్న కొవ్వును ఇది తొలగిస్తుంది. నాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని నివారించడంలో మిరపకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories