Diabetes Diet: షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫ్రూట్స్ తినొచ్చో తెలుసా!

Best Fruits for Diabetes Patients: (File Image)
Tips for Diabetes Control: పండ్లు తిందామంటే... ఏవి తినాలో, ఏవి తినకూడదోనన్న సంశయం వెంటాడుతుంది.
Tips for Diabetes Control: షుగర్ వ్యాధి రాగానే ఆహారం విషయంలోచాలా అనుమానాలుంటాయి. తింటే షుగర్ పెరుగుతుంది.. తినకపోతే నీరసం వస్తుంది. నాలుక ఏమో బడ్స్ ఎఫెక్ట్ తో రుచులు కోరుతూ ఉంటుంది. దానిని అదుపులో పెట్టుకోలేక.. ఎండిపోతున్న నోరుతో ఇబ్బందిపడలేక నానా ఇబ్బంది పడుతుంటారు షుగర్ వ్యాధిగ్రస్తులు.
షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. ఏవి తినాలి. ఏవి తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతుంది. కనీసం పండ్లు తినాలన్నా.. భయపడుతుంటారు. అలాంటివారు.. ఈ పండ్లను మాత్రం మరో ఆలోచన లేకుండా తినొచ్చు. మరి ఎలాంటి పండ్లను తినచ్చో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.
యాపిల్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. రక్తప్రసరణను మెరుగుపరచడంలో ద్రాక్షపండ్లు ముందుంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది. విటమిన్ సి కలిగిన పండ్లు డయాబెటిస్ పేషెంట్లకి ఎంతో మంచిది. అందువల్ల కమలా పండ్లు తీసుకోవడం ముఖ్యమే.
దానిమ్మపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. పుచ్చకాయల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహులకు అంతమంచిది కాదు.. కానీ.. ఇందులోని పొటాషియం కిడ్నీల పనితీరుని మెరుగ్గా చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండుని తీసుకోవచ్చు.
నేరేడుపండ్లని తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కేవలం ఈ పండ్లే కాదు.. వీటి గింజలను పౌడర్ చేసుకుని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది.
అస్సలే సమ్మర్ కదా ఎదురుగుండా మామిడి పండ్లు కనిపిస్తూ వుంటాయి. తింటే షుగర్ ఆమాంతం పెరిగిపోతుందనే భయం మాత్రం వెంటాడుతూనే వుంటుంది. అయితే మామిడిపండు తినేప్పుడు కార్బ్స్ ను తగ్గించి చిన్న సైజు మామిడి పండు కూడా అప్పుడప్పుడు లాంగించేయొచ్చు. అది పనిగా లాంగించేశారనుకోండి ఇంక షుగర్ ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు సుమా ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే.
సో పై చెప్పిన పండ్లను తీసుకుంటూ నిత్యం శరీరాన్ని అలసట చెందే విధంగా వాకింగ్, ఎక్సర్ సైజులు వంటి చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Revanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMT