ఇడ్లీలు తినడం మంచిదా కాదా?

ఇడ్లీలు తినడం మంచిదా కాదా?
x
Highlights

ఇడ్లీలు తినడం మంచిదా కాదా? ఇడ్లీలు తినడం మంచిదా కాదా?

ఎక్కువ మంది ఉదయం తినే అల్పహారం ఇడ్లీ. మినప పప్పు, బియ్యం మిశ్రమంతో చేసే ఇడ్లీలు ఉత్తమ పోషకాహారం. ఇడ్లీల్లో కొలెస్ట్రాల్ వుండదు. క్యాలరీలు కూడా తక్కువే ఉంటాయి. దీంతో చాలా మంది ఈ అల్పహారాన్నే ఆరగిస్తారు. ఒక ఇడ్లీలో దాదాపుగా 40 నుండి 60 క్యాలరీలు ఉంటాయి. అయితే ఇడ్లీ తయారిలో చేసే కొన్ని పొరపాట్లు ఆ వంటకం సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. శరీరానికి అందాల్సిన పోషకాల కోల్పోతున్నాయి.

ఇడ్లీలు తెల్లగా ఉండాలని పొట్టు తీసిని మినపప్పు, తెల్లటి బియ్యంపు రవ్వ వాడకూడదు. ఈ చేయడంలో వల్ల ఆ ధాన్యాల్లోని పోషకాల్ని కొంతమేర నష్టపోతాం.మినపప్పులో ప్రోటీన్లు, బియ్యం రవ్వలోని పిండిపదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి. అయితే ఇడ్లీ తయారిలో రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్,బి విటమిన్లు శరీరానికి లభిస్తాయి.

ఉదయం చేసే అల్పహారంలో ఇడ్లీ ది బెస్ట్ చేప్పవచ్చు . వాటిలో పిండి పదార్థాలు ఉండడం వల్ల అవి తేలికగా జీర్ణం అవుతాయి. ఇడ్లీతో పాటు సాంబారు, పప్పు, గుడ్లు, బాదం, మొలకెత్తిన గింజలు తీసుకుంటే త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఇటీవలి కాలంలో అనేక ధాన్యాలతో ఇడ్లీలు చేస్తున్నారు. బియ్యానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల్ని వాటి తయారిలో ఉపయోగిస్తున్నారు. మినుములు.కొర్రలు,రాగి వంటి వాటితో కూడా ఇడ్లీలను తయారు చేస్తున్నారు. వాటిలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు లభిస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories