ఫ్రైడ్ చికెన్‌తో కొత్త పరేషాన్.. బీ అలర్ట్‌

ఫ్రైడ్ చికెన్‌తో కొత్త పరేషాన్.. బీ అలర్ట్‌
x
Highlights

చికెన్... దీని పేరు చెప్పగానే అందరి నోర్లు ఊరుతాయి...వీక్ మొత్తం చికెన్‌ పెట్టినా లాగించేసే చికెన్ ప్రియులు చాలానే ఉన్నారు..ఫాస్ట్‌ ఫుడ్ సెంటర్ల...

చికెన్... దీని పేరు చెప్పగానే అందరి నోర్లు ఊరుతాయి...వీక్ మొత్తం చికెన్‌ పెట్టినా లాగించేసే చికెన్ ప్రియులు చాలానే ఉన్నారు..ఫాస్ట్‌ ఫుడ్ సెంటర్ల పుణ్యమా ఎనీ టైం చికెన్ అందుబాటులో ఉంటోంది. ముఖ్యంగా ఫ్రైడ్ చికెన్ అంటే అందరూ లొట్టలేసుకుని మరి లాగించేస్తుంటారు...దీనికి సమయం సందర్భం ఏమీ లేదు...వీకెండ్ వచ్చినా...ఫ్రెండ్స్ పుట్టినరోజైనా...ఫ్రైడ్ చికెన్‌కే ప్రయారిటీ ఇచ్చే వారు చాలా మంది ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. హాట్ వింగ్స్ అని, క్రిస్పీ చికెన్ అని, చికెన్ బక్కెట్ అని, హాట్‌ అండ్ క్రిస్పీ అని ఇలా ఎన్నో రకాల ఫ్రైడ్ చికెన్‌లను ప్రస్తుతం చిన్నా పెద్ద తేడా లేకుండా ఇష్టంగా ఆరగించేస్తున్నారు..అయితే దీంతో దేశంలో ఫ్రైడ్ చికెన్ స్టోర్లకు డిమాండ్ కూడా అదే విధంగా పెరుగుతూనే ఉంది.

మరి లొట్టలేసుకుంటూ తినే ఈ ఫ్రైడ్ చికెన్ తింటే మంచిదేనా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా...ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం....ఏం చెబుతుందంటే ఫ్రైడ్ చెకెన్ తింటే... స్వర్గానికే మెట్లు ఎక్కినట్లే నని చెబుతోంది. అవును ఈ చికెన్ తింటే మృత్యువుని మనం ఆహ్వానించినట్లే అవుతుందని అంటోంది.

మనం తినే ఫ్రైడ్ చికెనే మన గుండెని ఫ్రై చేస్తుందట..అవును రోజూ ఫ్రైడ్ చికెన్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే సూచనలు ఉన్నట్లు తాజా సర్వే చెబుతోంది. అలాగే క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా మందిలో కనిపించాలని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఫ్రైడ్ చికెన్ తినడం వల్లే కాదు...ఫ్రైడ్ మటన్, ఫ్రైడ్ చికెన్, తో పాటు మిగతా ఏ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నా ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు .

దేశంలో ఈ మధ్యకాలంలో ఈ స్టోర్లు చాలా విస్తరించాయి...ముఖ్యంగా భాగ్యనగరంలో ప్రతి గల్లీకో స్టోర్ వెలుస్తోంది...బ్రాండ్ కంపెనీలే కాకుండా నిరుధ్యోగులు సైతం ఈ రంగాన్ని ఎంచుకుని ఆదాయాన్ని పొందుతున్నారు.

ఈ ఫ్రైడ్ చికెన్‌ తయారీ కోసం విపరీతంగా నూనెను వినియోగిస్తారు...అదే నూనును తిప్పి తిప్పి వాడతారు..అందులవల్లే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి..ముఖ్యంగా యువకులపై ఈ ప్రభావం అధికంగా ఉంటోంది..ఎందుకంటే వీరే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు క్యూ కడతారు కాబట్టి. ఒక టి గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం అతిగా ఏది తీసుకున్నా అనర్థమే..అప్పడప్పుడు తీసుకుంటే అంతగా ప్రమాదం ఉండదు...కానీ దానికి అలవాటు పడితేనే అసలుకే ఎసరు వస్తుంది...అందుకే తస్మాత్ జాగ్రత్త.. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం కూడా ఆనందంగా సాగిపోతుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories