Health Tips: కాలేయానికి ఇది సూపర్‌ఫుడ్‌.. బోలెడు ప్రయోజనాలు పొందుతారు..!

Health Tips: కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.

Arun Chilukuri
Updated on: 13 March 2023 9:00 PM IST
Amla is a Superfood for the Liver You Will get Many Benefits
X

Health Tips: కాలేయానికి ఇది సూపర్‌ఫుడ్‌.. బోలెడు ప్రయోజనాలు పొందుతారు..!

Health Tips: కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి ఏకకాలంలో అనేక పనులు చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం, పిత్తం తయారు చేయడం, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడడం, టాక్సిన్‌లను బయటకు తీయడం, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం వంటి పనులు చేస్తుంది. ఇవి కాకుండా కొవ్వు తగ్గించడం, కార్బోహైడ్రేట్లు స్టోర్‌ చేయడం చేస్తుంది. అందుకే ఈ భాగంలో చిన్నపాటి సమస్య ఏర్పడితే అది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. అయితే కాలేయానికి సహాయం చేసే ఒక ముఖ్యమైన కాయ ఉంది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఉసిరికాయ

సాధారణంగా జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉసిరికాయ తినమంటారు. కానీ ఇది కొవ్వు కాలేయాన్ని కూడా ఎదుర్కొంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతూ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనలను రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఉసిరి ఔషధం కంటే తక్కువేమి కాదు.

ఇది మధుమేహం, అజీర్ణం, కంటి సమస్యలు, కాలేయ బలహీనతకు వ్యతిరేకంగా పోరాడటానికి పనిచేస్తుంది. మెదడును బలోపేతం చేయడంతో పాటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. దీన్ని నిత్యం తీసుకునే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాలేయానికి సంబంధించినంతవరకు ఈ అవయవాన్ని ఉసిరి ద్వారా రక్షించవచ్చు. ఎందుకంటే కాలేయం విషాన్ని వదిలించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో హైపర్లిపిడెమియా, మెటబాలిక్ సిండ్రోమ్ తగ్గుతాయి.

ఆమ్లా ఎలా తీసుకోవాలి?

ఉసిరికాయ తినడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సులభమయిన పద్దతి ఏంటంటే నేరుగా నమలడం ద్వారా తినవచ్చు. కొవ్వు కాలేయ సమస్యలు ఉన్నవారు ఈ పండును నల్ల ఉప్పుతో తినాలి. అంతే కాకుండా ఉదయం నిద్ర లేవగానే ఉసిరి టీని తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story