పాడేరులో ఎవరిది గెలుపు...గిడ్డి ఈశ్వరి మరోసారి గెలుస్తారా?

పాడేరులో ఎవరిది గెలుపు...గిడ్డి ఈశ్వరి మరోసారి గెలుస్తారా?
x
Highlights

విశాఖజిల్లా పాడేరు చాలా ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర వున్న ప్రాంతం. ప్రతిపార్టీకి మిశ్రమ స్పందన అందించిన నియోజకవర్గం. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలకు...

విశాఖజిల్లా పాడేరు చాలా ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర వున్న ప్రాంతం. ప్రతిపార్టీకి మిశ్రమ స్పందన అందించిన నియోజకవర్గం. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలకు ఆదరణ చూపిన గిరిజనం వున్న ప్రదేశం. అందుకే ఈ నియోజకవర్గం రాజకీయ ప్రస్థానం చాలా వినూత్నం మరి పాడేరు పట్టణాన్ని ఏలేదేవరు పాడేరులో కాలర్ ఎగరేసేది ఎవరు?

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు పట్టణం ప్రత్యేకత వేరు. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్. అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తున్న నియోజకవర్గం.

పాడేరు సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్లు 2,27,042 మంది. నాలుగు మండలాలు వున్నాయి. జీ. మాడుగుల, చింతపల్లి, గూడెంకొత్తవీధీ, కొయ్యూరు కలిసి వున్నాయి. 1983 నుంచి తీసుకుంటే, 2014 వరకు నాలుగు పర్యాయాలు టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి బీఎస్పీ, ఒకసారి వైసీపీలు విజయం సొంతం చేసుకున్నాయి.

2014లో చాలా విచిత్రంగా అసలు టీడీపీకి అభ్యర్ధి లేరు. వైసీపీ నుంచి గిడ్డి ఈశ్వరి, బీజేపీ నుంచి లోకుల గాంధీ, సీపీఐ అభ్యర్థిగా గొట్టేటి దేముడు, కాంగ్రెస్ నుంచి బాలరాజు పోటీ పడ్డారు. అయితే వైసీపీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి 26 వేల ఓట్ల మెజారిటీ గెలుపొందారు. ఆ తర్వాత ఆమె అనూహ్యంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

ప్రస్తుతం 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ‌ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వైసీపీ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి, జనసేన నుంచి పసుపులేటి బాలరాజు బరిలో నిలిచారు. అయితే ఏజెన్సీ ప్రాంతం కావడంతో వైసీపీకి మంచి పట్టు వున్నా, అభ్యర్ధి రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, ఆ పార్టీని కాస్త కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో పాడేరులో గిడ్డి ఈశ్వరి, బాలరాజు మధ్య పోటీ సాగిందన్న చర్చ కూడా జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories