వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి

Arun Chilukuri
Published on: 31 Jan 2019 12:53 PM IST
వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి
X

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరుతానంటూ గత వారమే ప్రకటించిన ఆయన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. మేడాతో పాటు ఆయన అనుచరులకు వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలోని రాజంపేటలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి విజయం సాధించిన మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలోని ఆధిపత్య పోరు కారణంగా టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మేడా, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story