కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

- కోస్తాంధ్ర తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం - కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం - మరో 72 గంటలపాటు వర్షాలు

K V D Varma
Published on: 22 Sept 2019 11:28 AM IST
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం
X

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర తీరానికి సమీపంలో ఇది ఆవరించి ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక, ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

K V D Varma

K V D Varma

Next Story