ఒకనాటి శిష్యులు..నేడు ప్రత్యర్థులు...అయ్యన్నకే ఎందుకిలా జరుగుతోంది?

ఒకనాటి శిష్యులు..నేడు ప్రత్యర్థులు...అయ్యన్నకే ఎందుకిలా జరుగుతోంది?
x
Highlights

విశాఖ చరిత్రలో సుదీర్ఘమైన అనుభవం వున్న రాజకీయ దిగ్గజం విభిన్నమైన నైజం ముక్కుసూటి తత్వం దూకుడు మనస్తత్వం ఆయనే చింతకాయల అయ్యనపాత్రుడు నర్శీపట్నం...

విశాఖ చరిత్రలో సుదీర్ఘమైన అనుభవం వున్న రాజకీయ దిగ్గజం విభిన్నమైన నైజం ముక్కుసూటి తత్వం దూకుడు మనస్తత్వం ఆయనే చింతకాయల అయ్యనపాత్రుడు నర్శీపట్నం నియోజకవర్గంలో ఎదురులేని వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఇప్పటివరకు ఛరిష్మా చాటారు. అయితే తన దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దుకున్నవారే, ఇప్పుడాయన ప్రత్యర్థులు పొలిటికల్ పాఠాలు నేర్చుకున్న శిష్యులే శత్రువులయ్యారు. ఉత్తరాంధ్ర టీడీపీకి కీలకమైన అయ్యన్నపాత్రుడికి ఇలాంటి, సిచ్యువేషన్ ఎందుకొచ్చింది ఆయనను ఓడించిన ప్రత్యర్థుల ఆయుధాలేంటి?

విశాఖ జిల్లా నర్శీపట్నం నియెజకవర్గం. రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రత్యేకం. చింతకాయల అయ్యనపాత్రుడు ఇలాఖాగా చెప్పుకునే సెగ్మెంట్. నర్సీపట్నం నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయం కుటుంబం అయ్యన్నపాత్రుడిది. నర్శీపట్నంలో ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు విజయబావుటా ఎగురవేసింది తెలుగుదేశం. ప్రధానంగా గో పాత్రుడు, అయ్యనపాత్రుడు కుటుంబాల మధ్య రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. అయ్యనపాత్రుడు ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పదవులను, రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర టీడీపీకి పెద్దదిక్కుగా నిలిచారు. ఎంతోమంది రాజకీయ ఆరంగేట్రానికి సోపానమయ్యారు. వారి గురువుగా ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఇప్పడు అదే శిష్యులు, అయ్యన్న పాత్రుడికి ప్రత్యర్థులయ్యారు, రాజకీయ శత్రువులయ్యారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పొలిటికల్ ఎంట్రీ చేయించింది కూడా అయ్యనపాత్రుడే. అయితే తరువాత తన ధోరణితో విశాఖలో వివాదస్పద నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు అయ్యన. గంటా శ్రీనివాసరావు, అయ్యనపాత్రుడుల మధ్య విభేదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గంటా అయ్యనకు రాజకీయ శత్రువుగా మారారు. ఒకే పార్టీలో ఉన్నా, బద్ద శత్రువులుగా కత్తులు దూసుకున్నారు.

ఉమాశంకర్ గణేష్. మొన్న జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అయ్యన్నపాత్రుడిపై విజయం సాధించారు. అయితే ఈయన కూడా అయ్యనపాత్రుడు వద్దే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. అవే పాఠాలతో గురువును ఓడించి, గురువుకు మించిన శిష్యుడు అనిపించుకోవడమే కాదు, గురువును జయించిన శిష్యుడిగానూ పేరు తెచ్చుకున్నారు.

తనదైన శైలిలో నియోజకవర్గంలో పట్టు పెంచుకున్న గణేష్‌తో, అయ్యన తన దూకుడూ స్వభావంతో విబేధాలు తెచ్చుకున్నారన్నది, పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. అయ్యన్నతో పోరుపడలేక, చివరికి టీడీపీ నుంచి బయటకు వచ్చిన పెట్ల ఉమాశంకర్ గణేష్, వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గురువు అయ్యనపై పోటీ చేసినా, స్వల్ప మెజారీటీతో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం, ప్రతీకారం తీర్చుకున్నారు. పొలిటికల్ గురు అయ్యనపాత్రుడుపై మంచి మెజారిటీతో విజయం సాధించారు గణేష్. నర్శీపట్నంలో మరో ప్రత్యామ్నాయ రాజకీయానికి నాంది పలికారు.

అయితే శిష్యులే శత్రువుగా మారడానికి కారణం, అయ్యన్న దూకుడు స్వభావమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. తన మాటకు బదులిచ్చే ఎవర్నీ ఆయన దగ్గరకు రానివ్వరని, విమర్శలు చేస్తే, తట్టుకోలేరని, అందుకే శిష్యులైనా, అనుచరులైనా, చివరికి బంధువులనైనా దూరం పెడతారని సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గంటా, గణేష్ విషయంలోనూ అదే జరిగిందన్నది వారి విశ్లేషణ. మొత్తానికి శిష్యులను తయారు చేసి, వారి చేతిలోనే అయ్యన్నపాత్రుడు ఓటమిపాలవుతున్నారు. మరి రానున్న కాలంలో అయ్యన్న రాజకీయ భవిష్యత్తేంటన్నది కాలమే సమాధానం చెప్పాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories