కాంగ్రెస్‌లో చేరిన 'షాట్‌గన్‌' శతృఘ్న సిన్హా

Arun Chilukuri
Updated on: 12 May 2025 10:28 AM IST
కాంగ్రెస్‌లో చేరిన షాట్‌గన్‌ శతృఘ్న సిన్హా
X

యాక్టర్ పొలిటీషియన్ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తాను 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై పోటీ చేయనున్నారు.

పదేళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ నియోజకవర్గ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను బీజేపీ ప్రకటించడంతో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ లో చేరారు. 2014లో తనకు బీజేపీ నుంచి ఎటువంటి సహకారం అందకపోయినప్పటికీ, సిన్హా సొంతంగా గెలిచారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి గుడ్‌బై చెప్పిన శత్రుఘ్న సిన్హా బీజేపీపై మండిపడ్డారు. గతంలో బీజేపీలో ప్రజాస్వామ్యం ఉండేదని, ఇప్పుడు నియంతృత్వం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీలో సమష్టి నిర్ణయాలు ఉండేవన్నారు. ప్రస్తుతం వన్ మ్యాన్ షో, టూ మ్యాన్ ఆర్మీగా తయారైందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story