పట్టాలు విరగడంతో విశాఖ-విజయవాడ మధ్య నిచిన రైళ్లు

K V D Varma
Published on: 8 Oct 2019 9:37 AM IST
పట్టాలు విరగడంతో విశాఖ-విజయవాడ మధ్య నిచిన రైళ్లు
X

విశాఖపట్నం దగ్గరలోని కశింకోట వద్ద రైలు పట్టాలు విరిగిపోయాయి. విషయం తెలిసిన అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సకాలంలో వీటిని గుర్తించడంతో విశాఖపట్నం విజయవాడ మార్గంలోని రైళ్ళను ఎక్కడికక్కడ నిలిపివేశారు. విశాఖ నుంచి బయలుదేరిన సింహాద్రి, జన్మభూమి రైళ్ళను దువ్వాడ వద్ద నిలిపివేశారు. అదేవిధంగా దూర ప్రాంతాలనుంచి వస్తున్నా రైళ్ళను కూడా నిలిపివేయడంతో అన్ని రైళ్ళూ రెండుగంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం పట్టాలను రిపేరు చేస్తున్నారు. మధ్యాహ్నానికల్లా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

K V D Varma

K V D Varma

Next Story