ఉగ్ర కలకలం...హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్

ఉగ్ర కలకలం...హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్
x
Highlights

హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ : NIA జరిపిన సోదాల్లో...

హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ : NIA జరిపిన సోదాల్లో ముగ్గురు ఐసిస్ స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం కింగ్స్ కాలనీలోని 8 మంది అనుమానితుల ఇళ్లలో NIA బృందాలు సోదాలు చేయగా ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న ముగ్గురు దొరికారు. అదుపులోకి తీసుకున్న ముగ్గుర్ని మాదాపూర్‌లోని NIA కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

ఇవాళ ఉదయం నుంచి రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం కింగ్స్ కాలనీల్లో 8 NIA బృందాలు ఉగ్రవాద కోణంలో తనిఖీలు చేయగా ముగ్గురు పట్టుబడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో సోదాలు నిర్వహించిన NIA ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర్నుంచి ఉగ్రవాద కుట్రల కూపీ లాగుతోంది.

రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేత హత్యకు ఐసిస్ ఉగ్రవాది బాసిత్ టీం కుట్ర పన్నడాన్ని NIA భగ్నం చేసింది. అప్పట్లో నలుగురు యువకులు పట్టుబడటంతో ఈ కుట్రను ఛేదించారు. దీంతో టెర్రరిస్టు బాసిత్ హైదరాబాద్‌కి మకాం మార్చాడు. తర్వాత హైదరాబాద్ లో నలుగురు యువకులకు AK-47 సమకూర్చినట్లు సమాచారం. బాసిత్ అనుచరులు హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి విచారణలో సంచలన సమాచారం బయటపడే అవకాశం కనిపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories