కళ్యాణ్ రామ్ తరువాతి సినిమా ఇలా ఉండబోతోంది

Kalyanram
x
Kalyanram
Highlights

'నా నువ్వే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో హరికృష్ణ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం తన రాబోయే సినిమా '118' తో బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్.

'నా నువ్వే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో హరికృష్ణ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం తన రాబోయే సినిమా '118' తో బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది '118' సినిమా. షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తరువాత హరికృష్ణ విరించివర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో లాంచ్ అయింది కానీ అప్పటికి సినిమాలతో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ ఇన్నాళ్లకి సినిమాను మొదలుపెట్టనున్నారు. '118' సినిమా పనులు పూర్తవ్వగానే విరించి వర్మ దర్శకత్వంలో సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక విలేజ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక అద్భుతమైన ప్రేమ కథ తో మన ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories