ఉగ్ర గోదావరి:ముంచెత్తుతున్న వరదలు

ఉగ్ర గోదావరి:ముంచెత్తుతున్న వరదలు
x
Highlights

గోదావరిని వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ఉంది. తెలంగాణా లోని ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట మండలాలతో పాటు...

గోదావరిని వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ఉంది. తెలంగాణా లోని ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట మండలాలతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు రోడ్డు సంబంధాలు తెగిపోయాయి.

- తెలంగాణా లో రామన్న గూడెం వద్ద రెండో ప్రమాదహేచ్చరిక జారీ చేశారు.

- ముల్లకట్ట వద్ద రెండు కిలోమీటర్ల వెడల్పున.. 75 మీటర్ల ఎత్తులో జాతీయ రహదారిని తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

- ఏటూరినాగారం రాంనగర్ పరిసర ప్రాంతాల తండాలు గోదావరి ముట్టడిలో చిక్కుకున్నాయి.

-వెంకటాపురం మండలంలో పలు మండలాలు వరద ముంపు బారిన పడ్డాయి.

-భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ఉంది. ఆదివారం ఉదయానికి 43 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రికి 50.06 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం..

ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో ధవళేశ్వరానికి మరోసారి భారీగా వరద వస్తోంది. ఆదివారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఇది 13 లక్షల క్యూసెక్కులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరికి వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందాని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే పోలవరం మండలంలో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories