ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు

K V D Varma
Published on: 8 Oct 2019 10:11 AM IST
ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు
X

దసరా పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇరు రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

దుష్ట శక్తులపై దుర్గా మాత సాధించిన విజయాన్ని ఉత్సవంగా జరుపుకొందాం. అందరికీ దసరా శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినానా ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

దుష్ట శక్తులపై ఎప్పటికీ మంచిదే విజయమని కేసీఆర్ తెలిపారు. దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు అందించడం కోసం జగన్‌తోపాటు తెలంగాణ సీఎంవో ఇంగ్లిష్ లో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా కనిపించింది.



K V D Varma

K V D Varma

Next Story