ఆగస్టు లో బ్యాంక్ సెలవులు ఇవే!

K V D Varma
Published on: 1 Aug 2019 11:44 AM IST
ఆగస్టు లో బ్యాంక్ సెలవులు ఇవే!
X

ఆగస్టు నెలలో 10, 11, 12 తేదీల్లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. పదో తేదీ రెండో శనివారం కాగా, 11 ఆదివారం ఇవేలాగూ సెలవు దినాలే. అయితే, అదనంగా 12 వ తేదీ బక్రీద్ సందర్భంగా సెలవు రానుంది. దీంతో మూడురోజులు వరుసగా బ్యాంకులు పనిచేయవు. ఇక ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. ఆరోజు గురువారం. ఇక ప్రత్యేకంగా బ్యాంకులకు సెలవులు లేవు. 4,11,18,25 తేదీలు ఆదివారం కాగా, 10,24 రెండో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అంటే రెండో శనివారాలు, ఆదివారాలు కాకుండా బ్యాంకులకు రెండు రోజులు ఈ నెలలో అదనంగా సెలవులు రానున్నాయి.


K V D Varma

K V D Varma

Next Story