logo

వెబ్ ఛానల్స్ పై ఫైర్ అయిన యాంకర్

Anchor JhansiAnchor Jhansi
Highlights

కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం కొన్ని పిచ్చి టైటిల్స్ పెడతారని తెలిసిన విషయమే. లోపల కంటెంట్ వేరేగా ఉన్నా పైకి మాత్రం చూడగానే క్లిక్ చేసేయాలి అనిపించేంత రేంజిలో టైటిల్స్ పెడతారు.

కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం కొన్ని పిచ్చి టైటిల్స్ పెడతారని తెలిసిన విషయమే. లోపల కంటెంట్ వేరేగా ఉన్నా పైకి మాత్రం చూడగానే క్లిక్ చేసేయాలి అనిపించేంత రేంజిలో టైటిల్స్ పెడతారు. దాదాపు టాలీవుడ్లోని అందరూ సెలబ్రిటీలు వారిపై ఇలాంటి వార్తలు చూసే ఉంటారు. అయితే ఇలాంటి మిస్లీడింగ్ టైటిల్స్ పెట్టేవారిపై పాపులర్ యాంకర్ ఝాన్సీ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. "ఈమధ్య మీకు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ తో ఏదో గోడవయ్యిందని తెలుస్తోంది. ఏంటదీ" అని అడిగగా ఝాన్సీ బాగా చిరాకు పడ్డారు.

అది కేవలం ఒక చానల్ వాళ్లు క్లిక్స్ కోసం చేసిన పని అని అందరూ దాన్ని పట్టించుకుంటున్నారు కానీ ఇంటర్వ్యూలో తాను ఇచ్చిన క్లారిటీ ని ఎవరూ చూడడం లేదని వాపోయారు ఝాన్సీ. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ వీడియోను ఒక వెబ్ ఛానల్ వారు 'ఇంటర్వ్యూవర్ పై ఫైర్ అయిన ఝాన్సీ' అంటూ స్పైసీ టైటిల్ పెట్టి విడుదల చేశారని తెలుస్తోంది. చూస్తూ ఉంటే సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, మాట్లాడకపోయినా వాటికి పెడర్థాలు తీయడం లో ఈ వెబ్ చానల్స్ వాళ్ళు ముందుంటున్నారు.


లైవ్ టీవి


Share it
Top