Top
logo

కొడుకు పుట్టడం లేదని ఐదుగురు కూతుళ్ళతో బావిలో దూకిన తల్లి ..

కొడుకు పుట్టడం లేదని ఐదుగురు కూతుళ్ళతో బావిలో దూకిన తల్లి ..
X
Highlights

ఆమెకి ఐదుగురు సంతానం ..అందులోను అందరు ఆడపిల్లలే .. ఒక్క మొగబిడ్డను కూడా కనలేదని అత్తింటి వారి వేధింపులు...

ఆమెకి ఐదుగురు సంతానం ..అందులోను అందరు ఆడపిల్లలే .. ఒక్క మొగబిడ్డను కూడా కనలేదని అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి.. దీనితో చేసేది ఏమి లేకా అ ఇల్లాలు తన ఐదుగురు ఆడపిల్లలతో సహా బావిలో దూకింది .. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు .. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది .. ఈ సంఘటన రాజస్తాన్ లోని బాడ్మేర్ లో చోటు చేసుకుంది .. బాన్డీ గ్రామానికి చెందినా రాణారామ్ వసుదేవి దంపతులకు ఇరవై ఏళ్ల కింద వివాహం జరిగింది .. అయితే వీరికి సంతోష (13), మమత (11), మైనా (9), హంస (9), హేమలత (3) అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు .. తనకి కుమారుడు పుట్టడం లేదని వసుదేవి ఎప్పుడు భాదపడుతూ ఉండేది .. ఈ క్రమంలో అత్తింటి వారి నుండి వేధింపులు ఎక్కువ కావడంతో తన ఐదుగురుకూతుళ్ళతో కలిసి బావిలో దూకేసింది. మొదటగా బావిలోకి తన ఐదుగురు కూతుళ్ళను తోసేసి తర్వాత తానూ దూకింది . ఇందులో ఆరుగురు మరణించడంతో అక్కడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ...
Next Story