Green Card: అమెరికా పొమ్మనంటోంది... ఈ దేశాలు రమ్మంటున్నాయ్

Green Card: అమెరికా పొమ్మనంటోంది... ఈ దేశాలు రమ్మంటున్నాయ్
x
Highlights

Green Card: అమెరికాలో H-1B వీసా నిలిపివేస్తారన్న వార్తలు భారతీయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వీసా నిలిచిపోతే అమెరికాలో గ్రీన్ కార్డు పొందడం...

Green Card: అమెరికాలో H-1B వీసా నిలిపివేస్తారన్న వార్తలు భారతీయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వీసా నిలిచిపోతే అమెరికాలో గ్రీన్ కార్డు పొందడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి విదేశాల్లో స్థిరపడాలనుకునేవారు అమెరికాకు బదులుగా ఈ దేశాల్లో కూడా స్థిరపడవచ్చు. ఆ దేశాలు ఏవో చూద్దాం.

ఫ్రాన్స్

ఐదేళ్లు ఫ్రాన్స్ లో నివసిస్తే విద్యార్థులు శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాలం పూర్తయిన తర్వాత తాత్కాలిక నివాస అనుమతికి అప్లయ్ చేసుకోవచ్చు. స్నాతకోత్తర పదవి లేదా స్వంత బిజినెస్ ప్రారంభించేవారికి ఈ పర్మిషన్ ఉంటుంది. ఐదేళ్లు దేశంలో నివసించిన తర్వాత శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐర్లాండ్

మూడు కండిషన్స్ ప్రకారం ఇక్కడ శాశ్వత నివాసం లభిస్తుంది. స్టూడెంట్ వీసాతో వచ్చి నివాసం కాలం పూర్తి చేయాలి. పదవి వీసా పొంది 1 నుంచి 2ఏళ్లు పనిచేయాలి. ఈ వీసాలో స్పాన్సర్ షిప్ లేకుండా పూర్తి కాలం పనిచేసుకోవచ్చు. కనీసం ఐదేళ్లు పనిచేసిన తర్వాత శాశ్వత నివాసానికి అర్హులవుతారు.

నార్వే

శాశ్వత నివాసానికి కనీసం మూడేళ్ల నివాస పర్మిషన్ ఉండాలి. నార్వే యూనివర్సిటీ పట్టా ఉండాలి. ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునేందుకు తగినంత డబ్బు ఉండాలి. నార్వేయన్ భాష కూడా తెలిసి ఉండాలి. ఎలాంటి నేర చరిత్ర ఉండరాదు.

నెదర్లాండ్స్

శాశ్వత నివాసానికి కనీసం ఐదేళ్లు దేశంలో నివసించి ఉండాలి. చదివిన సమయం కూడా ఇందులో ఉంటుంది. ఐదేళ్లు పూర్తి చేయడానికి కొందరు ఓరియంటేషన్ సంవత్సర నివాస పర్మిషన్ కు దరఖాస్తు చేసుకుంటారు. దీంతో మరింత చదవడానికి ఛాన్స్ లభిస్తుంది.

జర్మనీ

జర్మనీలో స్థిరపడాలంటే రెండేళ్ల పని నివాస అనుమతి పొందే కొన్ని కండిషన్స్ పూర్తి చేయాలి. జర్మనీలో ఉద్యోగం చేయాలి. జర్మన్ భాష తెలిసి ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories