ఇండియా టీ, సమోసాకు బ్రిటన్‌లో యమా క్రేజ్‌‌..!

*బ్రిటన్ ప్రజలు కొత్తరుచులు కోరుకుంటున్నారన్న..యునైటెడ్‌ కింగ్‌డమ్‌ టీ అండ్‌ ఇన్‌ఫ్యూజన్స్‌ అసోసియేషన్‌

Jyothi
Published on: 23 Jan 2023 9:30 AM IST
Yama Craze in Britain for India Tea and Samosa
X

ఇండియా టీ, సమోసాకు బ్రిటన్‌లో యమా క్రేజ్‌‌..! 

UK: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్‌ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్‌ యువతరంలో యమా క్రేజ్‌ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ టీ అండ్‌ ఇన్‌ఫ్యూజన్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్‌ చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు.

Jyothi

Jyothi

Next Story