Thailand: 80 వేల ఫొటోలు, వీడియోలతో సన్యాసులను బెదిరించి.. రూ.102 కోట్లు కొల్లగొట్టిన యువతి!

Thailand
x

Thailand: 80 వేల ఫొటోలు, వీడియోలతో సన్యాసులను బెదిరించి.. రూ.102 కోట్లు కొల్లగొట్టిన యువతి!

Highlights

Thailand: థాయ్‌లాండ్‌లో ఓ యువతి సన్యాసులపై అమానుష బ్లాక్‌మెయిల్‌తో రూ.102 కోట్లు దోచుకుందన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

Thailand: థాయ్‌లాండ్‌లో ఓ యువతి సన్యాసులపై అమానుష బ్లాక్‌మెయిల్‌తో రూ.102 కోట్లు దోచుకుందన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. మిస్ గోల్ఫ్‌గా గుర్తించిన ఈ మహిళ, తొమ్మిది మంది సన్యాసులను తాను సేకరించిన 80,000కు పైగా ఫోటోలు, వీడియోలతో బెదిరించి డబ్బు వసూలు చేసింది. మూడు సంవత్సరాల వ్యవధిలోనే సుమారు రూ.102 కోట్లు లూటీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ఒకరితో మొదలైన బంధం.. డబ్బు డిమాండ్లకు మారింది

2024 మేలో మొదలైన ఈ వ్యవహారం జూన్‌లో ఒక్క సన్యాసుడు తన సన్యాస జీవితం విడిచిన తర్వాత వెలుగులోకి వచ్చింది. బాధితులలో ఒకరి ద్వారా మొదలైన పరిచయం, బంధంగా మారి... బిడ్డకు తల్లినని చెప్పిన మిస్ గోల్ఫ్, ఖర్చుల పేరుతో మొదట 7 మిలియన్ బాట్ (అందుబాటులో రూ.1.85 కోట్లు) డిమాండ్ చేసింది. ఇదే పద్ధతిలో ఇతర సన్యాసులను కూడా టార్గెట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్

మిస్సుగోల్ఫ్ తన బలమైన ఆయుధంగా ఉపయోగించినవి – 80 వేలకు పైగా ఫోటోలు, వీడియోలు. ఈ దృశ్యాలతో బెదిరింపులకు పాల్పడి, మతస్థుల నుంచి భారీ మొత్తం డబ్బు దోచుకుంది. అందులో కొంత డబ్బును జూదాలకు వినియోగించినట్టు కూడా పోలీసులు తేల్చారు.

కేసులు నమోదు, దర్యాప్తు ప్రారంభం

ప్రస్తుతం ఆమెపై దోపిడీ, మనీ లాండరింగ్ తదితర మోసపూరిత కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో థాయ్ బౌద్ధ పాలనా సంస్థ – సంఘ సుప్రీమ్ కౌన్సిల్ – తీవ్రంగా స్పందించింది. సన్యాసులపై ప్రస్తుతం ఉన్న నియమాలను పునఃసమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

హెల్ప్‌లైన్ ఏర్పాటు.. మరిన్ని కేసుల గుర్తింపుకై చర్యలు

ఇలాంటి ఘటనలు మరెంతవరకు జరిగి ఉండొచ్చన్న అనుమానంతో థాయ్ పోలీసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. బాధితుల నుండి మరిన్ని ఫిర్యాదులు అందుకుంటున్నారు. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories