చంద్రుడిపై ప్రయోగాలు:ప్రైవేట్ సంస్థలు ఎందుకు పోటీ పడుతున్నాయి?


అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయింది.
అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. మార్చి 2న చంద్రుడి ఈశాన్య భాగంలో సేఫ్ గా ల్యాండ్ అయింది. చంద్రుడిపై ల్యాండైన తొలి ప్రైవేట్ ల్యాండర్ గా బ్లూ ఘోస్ట్ రికార్డు సృష్టించింది. భవిష్యత్తులో మానవ సహిత వ్యోమనౌకలను జాబిల్లి పైకి పంపాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రైవేట్ వ్యోమనౌకను పంపారు.
చంద్రుడి ఉపరితలంతో పాటు పరిసరాల గురించి అవగాహన కోసం ఈ వ్యోమనౌక పరీక్షలు చేయనుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము, ధూళి, ఇతర ఉపరితల లక్షణాలపై అధ్యయనం చేయనుంది. ఇందు కోసం అవసరమైన పరికరాలను దీంతో పాటు పంపారు. ల్యాండైన అరగంట తర్వాత మూన్ పై ఈ వ్యోమనౌక సెల్ఫీ దిగింది. ఆ తర్వాత చంద్రుడిపై ఉన్నపరిసరాలకు చెందిన ఫోటోలను కూడా ఈ వ్యోమనౌక పంపింది.
పేలోడ్ లు ఒక చంద్ర రోజు లేదా దానికి సమానమైన భూమిపై 14 రోజులు పనిచేస్తాయి. ల్యాండర్ లో అదనపు బ్యాటరీలు కూడా ఉన్నాయి. ఇవి రాత్రి సమయాల్లో పేలోడ్‌ల పనితీరును అనుమతించనున్నాయి. చంద్రుడిపై ఉన్న రాత్రులు చాలా చల్లగా ఉంటాయి.దీంతో వ్యోమనౌకలోని పరికరాలు పనిచేయడం ఇబ్బంది. మార్చి 14న సూర్య గ్రహణానికి సంబంధించిన హై డెఫినిషన్ చిత్రాలను తీయించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడిపై ఈ ల్యాండర్ నడవడానికి రోవర్ లేదు.
కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ లేదా సీఎల్‌పీఎస్ అనే ప్రత్యేక కార్యక్రమం కింద మూన్ మిషన్ కు నాసా పంపిన మూడో ప్రైవేట్ ఆపరేటరే ఫైర్ ఫ్లే. చంద్రుడిపై ప్రయోగాలు చేసేందుకు నాసా ఇప్పటికే డజనుకు పైగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సంక్లిష్టమై అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ సంస్థలకు చెందిన శక్తి, సామర్ధ్యాలను నాసా వినియోగించుకోనుంది నాసా.
చంద్రుడిపై అన్వేషణను మరింత ముమ్మరం చేయడానికి ప్రైవేట్ సంస్థల సేవలను నాసా ఉపయోగించుకుంటుంది. చంద్రుడిపై ఉన్న సహజ వనరుల కోసం కూడా అన్వేషణ సాగించనున్నారు. సీఎల్‌పీఎస్ లో భాగంగా గ2024 జనవరిలో అస్ట్రోబోటికి టెక్నాలజీస్ సంస్థ పెరెగ్రైన్ మిషన్ ను పంపింది.ఈ మిషన్ సక్సెస్ కాలేదు. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మెషీన్స్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేలా అథీనా అనే ల్యాండర్ ను ప్రయోగించింది. ఇందులో ఓ డ్రోన్ ను కూడా పంపింది. మార్చి 6న ఇది చంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండర్ ఎత్తు 15 అడుగులు. చందమామ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ఇది ల్యాండయ్యేలా ఫిక్స్ చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



