Coronavirus: కరోనా వైరస్‌పై గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

Coronavirus: కరోనా వైరస్‌పై గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ
x
కరోనా వైరస్‌పై గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ
Highlights

ప్రాణాంతకంగా మారి తీవ్ర కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ పట్ల డబ్ల్యూ హెచ్‌ ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ విస్తరిస్తున్న తీరు రోజురోజుకీ మృతుల...

ప్రాణాంతకంగా మారి తీవ్ర కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ పట్ల డబ్ల్యూ హెచ్‌ ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ విస్తరిస్తున్న తీరు రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 213కు చేరింది. మరో 9వేల816 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఒక్క చైనాలోనే 9వేల692 మందిని బాధితులుగా గుర్తించగా హాంగ్‌కాంగ్‌లో 12, మకావు 7, తైవాన్‌ 9, ఇతర ఆసియా దేశాల్లో 62, ఐరోపాలో 13, ఉత్తర అమెరికాలో 8, ఆస్ట్రేలియాలో 9, ఇతర ప్రాంతాల్లో 4 కేసులు నమోదైనట్లు ధృవీకరించారు. ఇక వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో 204 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకినట్లు ధ్రువీకరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories