ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం.. పెద్దఎత్తున విస్తరించిన లావా...

Indonesia: భారీ ఎత్తున పొగ, బూడిద ఆవరించిన వైనం...

Shireesha
Published on: 5 Dec 2021 9:22 AM IST
Volcano Eruption in Indonesia and Lava Spreads over Near Places | International News
X

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం.. పెద్దఎత్తున విస్తరించిన లావా... 

Indonesia: ఇండోనేసియాలోని మౌంట్ సెమేరు అగ్నిపర్వతం బద్దలైంది. భారీఎత్తున పొగ, బూడిద ఆవరించడంతో పరిసరాలన్నీ చీకటిమయమయ్యాయి. భయాందోళనతో వేలాది మంది స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పెద్దఎత్తున లావా పరిసర గ్రామాలకు విస్తరించడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిర్వాసితుల కోసం లుమాజాంగ్‌లో తాత్కాలిక షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఆ అగ్నిపర్వతం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో నిషేధిత జోన్‌ ఏర్పాటు చేశారు. 2020 డిసెంబరులోనూ ఈ అగ్నిపర్వం ఒకసారి బద్ధలైంది.

Shireesha

Shireesha

Next Story