Viral Video: టెక్సస్‌లో నిమిషాల్లో రోడ్డున ముంచేసిన భయానక వరద.. వైరల్ వీడియో

Viral Video: అప్పటివరకు రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. అటు ఇటు కార్లు తిరుగుతున్నాయి. కానీ ఏదో జరగబోతుంది అని అనుకునేలోపే ఒక్కసారిగా భయానకమైన నీటి ప్రవాహం ఆ రోడ్డును ముంచెత్తింది. దీనికి సంబంధించిన టైమ్ లాప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Indira Ram
Published on: 8 July 2025 7:08 PM IST
Viral Video
X

Viral Video: టెక్సస్‌లో నిమిషాల్లో రోడ్డున ముంచేసిన భయానక వరద.. వైరల్ వీడియో

Viral Video: అప్పటివరకు రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. అటు ఇటు కార్లు తిరుగుతున్నాయి. కానీ ఏదో జరగబోతుంది అని అనుకునేలోపే ఒక్కసారిగా భయానకమైన నీటి ప్రవాహం ఆ రోడ్డును ముంచెత్తింది. దీనికి సంబంధించిన టైమ్ లాప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా టెక్సస్ అతలాకుతలం అయిపోయింది. అకస్మాత్తుగా వరదలు ఊళ్లను ముంచెత్తడంతో ఎంతోమంది ఆ వరదల్లో కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన ఎన్నో హృదయాన్ని పిండేసే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో అయితే ఎంత తొందరగా వరద ప్రవాహం ముంచెత్తింది అనేది టైమ్ లాప్స్ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అప్పటివరకు రోడ్డుపైన కార్లు తిరుగుతూనే ఉన్నాయి. అయితే సడన్‌గా ఏదో జరగబోతుందనేది అక్కడ వాళ్లకు అర్ధమైంది. అందుకే ఇటు కార్లు ఇటు.. అటు కార్లు అటు అలానే ఉండిపోయాయి. కానీ కొన్ని నిమిషాల్లో భీకరంగా వరద పెరిగిపోయింది. వరద ప్రవాహం పెరిగే కొద్దీ కార్లు కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్లి .. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతాయి. ఇదొక టైం లాంప్స్ వీడియో కావడంతో ఎంతలా అక్కడ వాతావరణం మారిపోయిందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

Indira Ram

Indira Ram

Next Story