US Elections 2020 Updates: మీడియా, ఎలక్షన్ అధికారులు డెమొక్రాట్లతో కుమ్మక్కయ్యారు : ట్రంప్
Donald Trump Talks To Media : తనని రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా కుట్ర జరుగుతుందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందుకు వచ్చి లీగల్ ఓట్లు లెక్కిస్తే.. విజయం తనదే అంటూ ప్రకటించుకున్నారు. చట్టవ్యతిరేక ఓట్లను లెక్కిస్తే మాత్రం డెమొక్రటికన్లు ఓట్లను కొల్లగొడుతారని చెప్పుకచ్చారు. మీడియా, ఎలెక్షన్ అధికారులు డెమొక్రాట్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
ఎన్నికల వ్యవస్థ, కౌటింగ్ విధానాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతి ద్వారా బైడెన్ వర్గం భారీ మోసాలకు తెరలేపిందన్నారు. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఈ పద్ధతి ద్వారా కావాల్సినన్ని ఓట్లను వేయించుకున్నారని ట్రంప్ ఆరోపించారు. రిపబ్లికన్ ఎన్నికల పరీశీలకులు లేకుండానే కౌటింగ్ ఎలా జరుపుతున్నారని ట్రంప్ ప్రశ్నించారు.
Next Story




