కోర్టుల్లో డొనాల్డ్ ట్రంప్‌కి చుక్కెదురు

కోర్టుల్లో డొనాల్డ్ ట్రంప్‌కి చుక్కెదురు
x
Highlights

ఎన్నికల ఫలితాల్లోనే కాదు.. కోర్టుల్లో కూడా డొనాల్డ్‌ ట్రంప్‌కి చుక్కెదురవుతోంది. జో బైడెన్ నెగ్గిన అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు....

ఎన్నికల ఫలితాల్లోనే కాదు.. కోర్టుల్లో కూడా డొనాల్డ్‌ ట్రంప్‌కి చుక్కెదురవుతోంది. జో బైడెన్ నెగ్గిన అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. జార్జియా, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా, మిషిగాన్‌ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను ఆయన సవాల్‌ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్‌ ఇన్‌ ఓట్లను లెక్కించవద్దని గొంతు చిచ్చుకొని అరుస్తున్నారు. కౌటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్‌ మద్ధతుదారులు పిటిషన్లు జారీ చేస్తున్నారు.

ట్రంప్ మద్ధతుదారుల పిటిషన్లను జార్జియా, మిచిగాన్ కోర్టులు కొట్టిపారేసాయి. సరైన అధారాలు లేవని పిటిషన్లను పరిగణలోకి తీసుకోలేదు. బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టులు స్పష్టం చేశాయి. మరోవైపు నెవాడాలో ఎన్నికల వేళ భారీ అవకతవలు జరిగాయని మళ్లీ కొత్త స్వరం విప్పుతున్నారు. ఎన్నికల్లో జరిగిన మోసాలపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. ఓటమి భయంతో ట్రంప్‌ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అమెరికన్లు విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories