తుది అంకానికి చేరుకున్న అమెరికా ఎన్నికలు

తుది అంకానికి చేరుకున్న అమెరికా ఎన్నికలు
x
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాలో ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాలో ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోంది. ఇప్పటికే తొమ్మిది కోట్ల మంది మెయిల్ బ్యాలెట్స్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. హోరాహోరీగా ప్రచార పర్వం ముగిసిన తరువాత, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఇటు రిపబ్లికన్లు అటు డెమోక్రాట్లు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ముందస్తు ఓటింగ్ ప్రక్రియ పైన మొగ్గుచూపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి కాస్త ఎక్కువ సమయం సమయం పడుతుందని అంటున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ పోస్టల్ బ్యాలెట్‌లో నమోదైన ఓట్లు అత్యధికంగా డెమోక్రాట్‌లకు పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. తొమ్మిది కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే ఇప్పటికే భారీ స్థాయిలో పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని డెమోక్రాట్లు మద్దతు పలకగా, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పోలింగ్ రోజే భారీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తన మద్దతుదారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories