అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‎కు కరోనా పాజిటీవ్

*అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‎కు కోవిడ్-19 బారిన పడ్డారు

Rama Rao
Published on: 22 July 2022 7:38 AM IST
US President Joe Biden Tests Positive for COVID-19
X

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‎కు కరోనా పాజిటీవ్

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‎కు కోవిడ్-19 బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఫ్ఫైజర్ ఇంక్‌కు చెందిన పాక్స్‌లోవిడ్ చికిత్స పొందుతున్నట్లు వివరించింది. ఆయన ప్రస్తుతం వైట్ హౌస్‌లో ఐసొలేషన్‌లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్నిరోజులు పాటు అక్కడి నుంచి తన విధులను కొనసాగిస్తారని చెప్పారు.

వైట్ హౌస్ సిబ్బందితో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక జో బైడెన్ పాల్గొనవలసిన సమావేశాల్లో తన నివాసం నుంచి ఫోన్, జూమ్ ద్వారా పాల్గొంటారని వివరించారు. ఇదిలా ఉంటే బైడెన్ ఇప్పటికే కరోనా టీకాతోపాటు రెండు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నప్పటికీ.. తాజాగా ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story