కరోనా టీకా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్

Arun Chilukuri
Updated on: 22 Dec 2020 10:53 AM IST
కరోనా టీకా తీసుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్
X

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నారు. డెలావర్ లోని క్రిస్టియానా ఆసుపత్రిలో ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు బైడెన్. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నట్లు చెప్పారు. టీకా వేసుకోవాడనికి ప్రజలు సన్నద్దంగా ఉండాలన్నారు. రెండో టీకా తీసుకునేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియ చెప్పాల్సిన అవసరసం ఉందన్నారు. బైడెన్ టీకా తీసుకునే సమయంలో ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆయన పక్కనే ఉన్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉండడంతో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జోబైడెన్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story