సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్..

Joe Biden Falls off Cycle: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ బ్యాలెన్స్‌ తప్పి సైకిల్‌ నుంచి కిందపడ్డారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2022 5:49 PM IST
US President Joe Biden Falls Off Bike
X

సైకిల్ తొక్కుతూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్..

Joe Biden Falls off Cycle: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ బ్యాలెన్స్‌ తప్పి సైకిల్‌ నుంచి కిందపడ్డారు. వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్టు తెలిపారు. అధ్యక్షుడికి ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్‌ కార్యాలయం తెలిపింది. ఎప్పటిలాగే డెలావేర్‌ రాష్ట్రంలోని బీచ్‌హోమ్‌లో వీకెండ్‌ సందర్భంగా బైడెన్‌ కుటుంబంతో గడిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ప్రథమ మహిళ, భార్య జిల్‌ బైడెన్తో కలిసి ఇంటికి సమీపంలోని రెహోబోత్‌ బీచ్‌కు వెళ్లారు. సదరాగా స్టేట్‌ పార్క్‌లో సైకిల్‌ తొక్కారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు బైడెన్‌ సైకిల్‌ను ఆపారు. ఈ క్రమంలో కుడికాలు సడెన్‌గా పెడల్‌ మీది నుంచి తీశారు. దీంతో బ్యాలెన్స్‌ తప్పిన బైడెన్ కిందపడ్డారు.

అక్కడున్నవారి సాయంతో కిందపడిన బైడెన్‌ పైకి లేచారు. తాను బాగానే ఉన్నట్టు అధ్యక్షుడు తెలిపారు. అక్కడి నుంచి భార్య జిల బైడెన్‌తో కలిసి వెళ్లిపోయారు. అయితే బైడెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని బైడెన్కు వైద్యం అవసరం లేదని వైట్‌హౌస్‌ కార్యాలయం ప్రకటించింది. 2020 ఎన్నికలు పూర్తయిన తరువాత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందు తనకు ఇష్టమైన కుక్కపిల్లతో ఆడుతున్న సమయంలోనూ ఆయన కాలికి గాయమైంది. అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ద అధ్యక్షుడు జో బైడెనే అయితే 2024లోనూ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ ఆరోగ్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బైడెన్‌ కిందపడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story