భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్: 25 శాతం అదనపు సుంకాలు రద్దు? డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం!

భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్: 25 శాతం అదనపు సుంకాలు రద్దు? డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం!
x
Highlights

India US Trade Relations: భారత్‌పై విధిస్తున్న అదనపు సుంకాలను తగ్గించే దిశగా అమెరికా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా నుంచి ముడి చమురు...

India US Trade Relations: భారత్‌పై విధిస్తున్న అదనపు సుంకాలను తగ్గించే దిశగా అమెరికా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గించుకోవడాన్ని అమెరికా స్వాగతించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై విధిస్తున్న 25 శాతం అదనపు సుంకాలను సగానికి తగ్గించే లేదా పూర్తిగా తొలగించే అవకాశం ఉన్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ సూచనప్రాయంగా వెల్లడించారు.

రష్యా చమురు కొనుగోళ్ల తగ్గింపు.. అమెరికా విక్టరీ!

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భావిస్తున్న అమెరికాకు, భారత్ తీసుకున్న నిర్ణయం పెద్ద విజయమని బెసెంట్ పేర్కొన్నారు. "రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకోవడం ఒక భారీ విజయం. ఈ సానుకూల పరిణామం వల్ల గతంలో విధించిన అదనపు సుంకాలను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నాం" అని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపు:

గత కొంతకాలంగా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అసహనం వ్యక్తం చేస్తూ 25 శాతం మేర అదనపు సుంకాలను (Tariffs) విధించింది. అయితే, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో భారత్ తన దిగుమతుల వ్యూహాన్ని మార్చుకోవడంతో, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తే, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ లభించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories