అమెరికాలో ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ.. ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకెళ్తోన్న జో బైడెన్

Arun Chilukuri
Published on: 4 Nov 2020 10:55 AM IST
అమెరికాలో ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ.. ప్రస్తుతం ఆధిక్యంలో దూసుకెళ్తోన్న జో బైడెన్
X

అమెరికా సమీకరణాలు గంట గంటకూ మారుతున్నాయి. ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగుతోన్న అధ్యక్ష పోరులో నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. దీంతో గెలుపెవరిరి వరిస్తుందనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఎన్నికల ఫలితాల లెక్కింపులో ముందు ఆధిపత్యం సాధించిన ట్రంప్‌ ఆ తర్వాత కాస్త వెనకబడ్డారు. ట్రంప్‌ ఆశలు గల్లంతు చేస్తూ బైడెన్‌ దూసుకుపోయారు. ఇప్పటివరకు బైడెన్‌కు 209, ట్రంప్‌కు 118 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. అయితే చాలా రాష్ట్రాల్లో మళ్లీ ట్రంప్ గ్రాఫ్ పెరిగిపోతుండటంతో గెలుపెవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో పెన్సిల్వేనియా, వెర్మాంట్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, డెలావేర్‌, రోడ్‌ఐలాండ్‌లో బైడెన్‌ విజయం సాధించారు. టెక్సాస్‌, కాన్సాస్‌, మిస్సోరీలలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినాలో ట్రంప్‌ విజయం సాధించారు. ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలను కైవసం చేసుకున్న ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story