బైడెన్ ఖాతాలో మరో రికార్డ్

బైడెన్ ఖాతాలో మరో రికార్డ్
x
Highlights

రిపబ్లికన్ల కంచుకోటను బద్దలు చేస్తున్నారు బైడెన్. ఆరిజోనాలో అద్భుత విజయం సాధించారు. ఇదంతా సరే.. ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేస్తారా లేదా.. కోర్టులో...

రిపబ్లికన్ల కంచుకోటను బద్దలు చేస్తున్నారు బైడెన్. ఆరిజోనాలో అద్భుత విజయం సాధించారు. ఇదంతా సరే.. ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేస్తారా లేదా.. కోర్టులో చూసుకుందాం అంటున్నారు ఇంతకీ ఎలాంటి కేసులు వేయబోతున్నారు ? ఓడిపోతే మాములుగా ఉండదని ముందే చెప్పిన ట్రంప్ ఇప్పుడు అలానే చేస్తున్నారా ?

290 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్‌నకు అందనంత ఆధిక్యంలో నిలిచిన జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇక అధికార బదిలీయో మిగిలి ఉంది ! ఇంకో నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుండగా ఆరిజోనాలోనూ డెమోక్రటిక్‍ పార్టీ విజయం సాధించింది. సాంప్రదాయంగా రిపబ్లికన్ల కంచుకోట అయిన ఆరిజోనాలో బైడెన్‍ గెలవడం చరిత్రాత్మకం. ఈ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాల్లో డెమోక్రాట్‍ గెలవడం ఇది రెండోసారి. రాష్ట్రంలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అన్నీ బైడెన్ ఖాతాలోకి చేరాయ్. ఇక పాపులర్‍ ఓటులోనూ ఆయన దూసుకెళ్లారు. ఆయన 53 లక్షల ఓట్ల లీడింగ్‍లో ఉన్నారు. 34శాతం పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

ఐతే అటు తాను ఓడిపోతే మాములుగా ఉండదంటూ ప్రచారం సమయం నుంచి చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్ అంత వీజీగా అధికార బదిలీగా ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఓట్ల లెక్కింపు వ్యవహారంపై మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న రిపబ్లికన్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల దోపిడీ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయంటున్న ట్రంప్ వర్గాలు అవి మాత్రం బయటపెట్టడం లేదు. పెన్సిల్వేనియాలో ఎన్నికల పరిశీలకులను ఓట్ల లెక్కింపు పర్యవేక్షణకు అనుమతించకపోవడంపై కేసులు వేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

మిషిగన్‌లో 10వేల 700 ఓట్ల ఆధిక్యతతో ట్రంప్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పొందారు. ప్రస్తుతం ఇక్కడ బైడెన్‌ని విజేతగా ప్రకటించారు. ఇక్కడి ఫలితాలపై కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయ్. ఇక విస్కాన్సిన్‌ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని అందుకే కౌంటింగ్ మళ్లీ చేపట్టాలని ట్రంప్ మద్దతుదారులు చెప్తున్నారు. దీనిపై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయ్. ఇక నెవాడా నుంచి నుంచి బయటకు వెళ్లిపోయిన ఓటర్లు కూడా ఓట్లు వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ రాష్ట్ర రిపబ్లిక్ పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయ్.

ఇక అటు ఎలాంటి ఆధారాలు చూపించకుండా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళతానని ట్రంప్ ప్రకటించారు. ఈ ఫలితాలను సవాల్ చేయాలంటే ముందుగా వాటిని ఆయా రాష్ట్రాల న్యాయస్థానాల్లో కౌంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ జడ్జీలు దాన్ని ఆమోదించి, ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టాలనే ఆదేశాలను ఇవ్వాలి. వాటిని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా జరగడం అసాధ్యం అన్నది మరికొందరి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ నెక్ట్స్ స్టెప్ ఏంటి అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories