logo
ప్రపంచం

కరోనా టీకాల విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం

US Approves Expansion of COVID Vaccine Boosters
X

కరోనా టీకాల విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం

Highlights

COVID Vaccine Booster: కరోనా టీకాల విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

COVID Vaccine Booster: కరోనా టీకాల విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 65 ఏళ్లు పైబడిన వారికి, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు ఇచ్చారు. ఇకపై 18 ఏళ్లు నిండినవారందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నారు. అమెరికా తాజా నిర్ణయంతో కోట్లాదిమందికి లబ్ధి చేకూరనుంది. శీతాకాలంలో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Web TitleUS Approves Expansion of COVID Vaccine Boosters
Next Story