UAE: మిస్సైల్‌ను ధ్వంసం చేసిన యూఏఈ

UAE: యెమెన్‌ నుంచి మిస్సైల్‌ ప్రయోగించినట్టు వెల్లడి

Rama Rao
Published on: 31 Jan 2022 1:33 PM IST
United Arab Emirates Destroys Missile | Telugu Latest News
X

 మిస్సైల్‌ను ధ్వంసం చేసిన యూఏఈ

UAE: హౌతి ఉగ్రవాదులు ప్రయోగించిన మిస్సైల్‌ను ధ్వంసం చేసినట్టు యునైట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌-యూఏఈ తెలిపింది. మిస్సైల్‌ కూలిపోయిన చోట ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఈ మిస్సైల్‌ను యెమన్‌ నుంచి ప్రయోగించినట్టు యూఏఈ తెలిపింది.

ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు యూఏఈ తెలిపింది. తాజా హౌతి ఉగ్రదాడి.. ఈనెలలో మూడవది. మొదటి క్షపణి దాడిలో ముగ్గురు విదేశీయులు మృతి చెందారు. జనవరి 17న రెండో దాడి జరిగింది.

2020 తరువాత యూఏఈతో సంబంధాలు మెరుగుపడిన తరువాత తొలిసారి ఇజ్రాయెల్ అధ్య‌క్షుడు ఐజాక్‌ హర్జోగ్‌ తొలిసారి అధికారికంగా పర్యటించిన రోజే హౌతి ఉగ్రవాదులు దాడులు చేయడం గమనార్హం. అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి పర్యటనలో ఎలాంటి మార్పులు ఉండవని యూఏఈ తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story