తాలిబన్ల హింసాకాండలో ఊపిరి వదిలిన చిన్నారులు.. కనీసం 550 మంది..

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 17 Aug 2021 3:37 PM IST
Representational Image
X

Representational Image

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచం ఊహించనంత వేగంగా ప్రావిన్సులను ఆక్రమించేసిన తాలిబన్లు ఇంటింటా సర్వే చేపడుతున్నారు. మహిళలు, పిల్లలు, యువతులపై కన్నేసి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం నుంచి తాలిబన్లు అధికారాలు లాక్కునే క్రమంలో హింసాకాండ చోటు చేసుకుందని, తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. ఈ క్రమంలో కనీసం 550 మంది చిన్నారులు చనిపోయారని యూనిసెఫ్ ప్రకటించింది. మరోవైపు ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బెంగళూరులో ఉంటున్న ఆప్ఘాన్ స్టూడెంట్స్ తాలిబన్లు రాజ్యం చేజిక్కించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story