రష్యా బలగాల చేతిలో జెలెన్‌స్కీ చనిపోతే... ఏం చేయాలన్న ప్లాన్ రెడీ..

Ukrainians Have Plans In Place if Zelensky killed
x

రష్యా బలగాల చేతిలో జెలెన్‌స్కీ చనిపోతే... ఏం చేయాలన్న ప్లాన్ రెడీ.. 

Highlights

Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పీక్‌కు చేరుకుంటోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా అంతం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్.

Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పీక్‌కు చేరుకుంటోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా అంతం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని చంపేందుకు రష్యా సీక్రెట్ సర్వీసెస్ మూడు సార్లు ప్రయత్నించినా అధ్యక్షుడి ప్రత్యేక బలగాలు అడ్డుకున్నాయ్. అదే సమయంలో రష్యా దూకుడు నేపథ్యంలో జెలెన్‌స్కీ తర్వాత అధ్యక్షుడెవరన్నదానిపైనా ఉక్రెయిన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ రష్యా బలగాల చేతిలో జెలెన్‌స్కీ చనిపోయినా ఎక్కడా వెనకంజ వేయరాదన్న ఆలోచనలోకి అక్కడి ఉన్నతాధికారులు ఉన్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వం లేదన్న భావన కలగకుండా తక్షణం బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై అధికారులు ప్రణాళిక రూపొందినట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోని బ్లింకెన్ వెల్లడించారు. రష్యా చేస్తున్న అరాచకాలకు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తోందంటూ గర్జిస్తున్న జెలెన్‌స్కీ ఇక తాను మళ్లీ కన్పించనేమోనని నిన్ననే భావేద్వగంగా వ్యాఖ్యానించారు. ఓవైపు ఉక్రెయిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూనే మరోవైపు అధ్యక్షుడు జెలెన్‌స్కీని అంతమొందించాలన్న ఆలోచనలో కూడా రష్యా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories