బ్రిటన్‌లో కొనసాగుతున్న కోవిడ్ కల్లోలం.. ఒక్కరోజే 78,610 కేసులు నమోదు

Covid Cases: బ్రిటన్‌లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 16 Dec 2021 9:30 PM IST
UK Reports Record Daily Covid Cases
X

బ్రిటన్‌లో కొనసాగుతున్న కోవిడ్ కల్లోలం.. ఒక్కరోజే 78,610 కేసులు నమోదు

Covid Cases: బ్రిటన్‌లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత రోజువారీ కేసుల్లో బ్రిటన్‌లో ఇవాళ రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 78వేల 610 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక రోజువారీ కేసులు ఇవే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదయిన 68వేల 53 కేసులే ఇప్పటి వరకూ అధికం కాగా ప్రస్తుతం ఆ రికార్డును ఇవాల్టి కేసులు అధిగమించాయి. డెల్టాతో పాటు కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా నిర్ధారణ అవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story