రాజభవనంలోనే బందీగా మారిన యుఏఈ రాజకుమారి

Arun Chilukuri
Updated on: 17 Feb 2021 10:00 PM IST
రాజభవనంలోనే బందీగా మారిన యుఏఈ రాజకుమారి
X

రాజభవనంలోనే బందీగా మారిన యుఏఈ రాజకుమారి 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రధాని కుమార్తె ప్రిన్సెస్‌ లతీఫా తన రాజమందిరంలోనే బందీగా మారిపోయారు. 2018లో దుబాయ్‌ నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో రాజమందిరంలోనే ఆమెను బందీ చేశారు. రాజకుటుంబంలోని ఆంక్షలను భరించలేక ఆమె దేశం విడిచి పారిపోవాలనుకున్నారు. కాని చివరికి పూర్తిగా బందీగా మారిపోయారు. ఇటీవల బీబీసీ సంస్థ ఒక షోలో ప్రిన్సెస్‌ వీడియోను ప్రసారం చేసింది. అందులో నేను బందీనయ్యా..ఈ విల్లాను జైలుగా మార్చారు.. కనీసం గాలి కూడా పీల్చుకోవడానికి బయటకు వెళ్ళే వీలు లేదంటూ దీనంగా మాట్లాడిన వీడియో సంచనలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story