అమెరికా డల్లాస్ ఎయిర్ షోలో అపశృతి.. గాలిలో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు

* ప్రమాదంలో ఆరుగురు మృతి.. భారీగా ఎగసిపడ్డ మంటలు

R Tripura Malini
Published on: 13 Nov 2022 12:07 PM IST
two historic planes collide in dallas air show
X

గాలిలో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు

Dallas Air Show: అమెరికాలోని డల్లాస్‌ ఎయిర్‌ షోలో అపశృతి చోటు చేసుకుంది. పరస్పం రెండు బాంబర్‌ విమానాలు ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. బాంబర్‌ విమానం గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బెల్‌ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం దానిని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు క్షణాల్లోనే కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు యుద్ధవిమానాల్లో ఉన్న ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story