బ్రిటన్‌లో ఒమిక్రాన్ ఉథృతి.. ఒకే రోజు 12 మంది మరణం

Britain: యూరప్‌ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 3:02 PM IST
Twelve People in Britain Died with Omicron Variant
X

Britain: ఒమిక్రాన్‌తో 12 మంది మృతి

Britain: యూరప్‌ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్‌ కేసులు బ్రిటన్‌లో నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ బారిన పడి 12 మంది మృతి చెందినట్టు అధికారికంగా ధృవీకరించారు ఉప ప్రధాని. కొత్త వేరియంట్‌తో 104 మంది పలు ఆస్పత్రుల్లో చేరినట్టు ఆయన వెల్లడించారు. దీంతో ఆ దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 37వేలు దాటడం గమనార్హం. ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో అక్కడ బూస్టర్‌ డోసు పంపిణీని వేగవంతం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story