Donald Trump: గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం పావులు కదుపుతున్న ట్రంప్‌

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. గ్రీన్‌లాండ్‌ స్వాధీనం గురించి కలలు కంటున్నారు.

Arun Chilukuri
Published on: 9 Jan 2026 5:27 PM IST
Donald Trump: గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం పావులు కదుపుతున్న ట్రంప్‌
X

Donald Trump: గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం పావులు కదుపుతున్న ట్రంప్‌ 

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. గ్రీన్‌లాండ్‌ స్వాధీనం గురించి కలలు కంటున్నారు. ఆ ద్వీప దేశాన్ని ఎలాగైనా యూఎస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులోభాగంగా ముందుగా దాన్ని డెన్మార్క్‌ నుంచి దూరం చేసేందుకు.. గ్రీన్‌లాండ్‌ వాసులకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌ నుంచి విడిపోయి యూఎస్‌తో కలిసిపోయేలా ఒప్పించేందుకు గ్రీన్‌లాండ్‌ వాసులకు ప్రత్యక్ష నగదు చెల్లింపులపై ట్రంప్‌ పరిపాలనాధికారులు చర్చలు జరిపారు.

ఒక్కో వ్యక్తికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు.. అంటే భారత కరెన్సీలో 8 లక్షల నుంచి 89 లక్షల మధ్య డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేశారు. గ్రీన్‌లాండ్‌లో మొత్తం 57వేల మంది ప్రజలు ఉన్నారు. వీరికి నేరుగా ఈ చెల్లింపులు జరపాలనే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఇక, యూఎస్ నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్‌లాండ్‌ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్‌ ప్రధాని జెన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సన్‌ పేర్కొన్నారు. నాటో దేశాలు కూడా యూఎస్‌ ప్రణాళికపై ఆందోళన వ్యక్తంచేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story