ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్ కీలక బాధ్యతలు

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డోనల్డ్ ట్రంప్ .. తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్.. వివేక్ రామస్వామి కి డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు

Trump nominates Elon Musk And Vivek Ramaswamy to lead USA new efficiency department
X

 ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్ కీలక బాధ్యతలు

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డోనల్డ్ ట్రంప్ .. తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్.. వివేక్ రామస్వామి కి డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు.కి మస్క్ నాయకత్వం ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెడ్ గా ఉంటారు.


ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి సేవ్ అమెరికా ఉద్యమం అవసరానికి అనుగుణంగా ప్రభుత్వ బ్యూరోక్రసీ, అదనపు నిబంధనలు, వృధా ఖర్చులను తగ్గించడానికి ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మానానికి మార్గం సుగమం చేస్తారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.అమెరికన్ల జీవితాల్లో వీరిద్దరూ మార్పులు తీసుకొస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.



నేషనల్ ఇంటలిజెన్స్ మాజీ డైరెక్టర్ రాట్ క్లిఫ్ ను సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అర్కాస్నాస్ మాజీ గవర్నర్ మైక్ హుక్ అబీని ఇజ్రాయెల్ రాయబారిగా ఎంపిక చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి బాధ్యతలను పీట్ హెగ్సెత్ కు అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story