Trump: ఆప్ఘన్ లో అమెరికా దళాల ఉపసంహరణపై ట్రంప్ అసంతృప్తి

Trump: ఇంత దారుణమైన ఉపసంహరణ చరిత్రలో ఎక్కడా చూడలేదు: ట్రంప్

Sandeep Eggoju
Updated on: 31 Aug 2021 5:41 PM IST
Trump Dissatisfied on Withdrawal of American Troops in Afghanistan
X
డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఇమేజ్)

Trump: ఆప్ఘనిస్థాన్ లో అమెరికా దళాల ఉపసంహరణపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణమైన ఉపసంహరణని చరిత్రలో ఎక్కడా, ఏ యుద్ధంలోనూ చూడలేదన్నారు. ఆప్ఘన్ గడ్డపై అమెరికా 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికే చివరి క్షణం ఇంత అసహ్యంగా చేస్తారని ఊహించలేదన్నారు.. ఆప్ఘన్ లో అమెరికా యుద్ధవిమానాలు, ఇతర సైనిక పరికరాలు వదిలేయడం పట్ల ట్రంప్ మండిపడ్డారు వాటిని వెంటనే వెనక్కి తెచ్చుకోవాలి లేదా తిరిగి ఇవ్వాలని తాలిబన్లను డిమాండ్ చేయాలి.. యుద్ధం కోసం అమెరికా చేసిన ప్రతీ డాలర్ ను వెనక్కు తీసుకు రావాలి. ఆ పరికరాలను ఇవ్వకపోతే మళ్లీ సైన్యాన్ని పంపి వాటిని విడిపించుకు రావాలి అని ట్రంప్ సూచించారు. తాలిబన్లు వాటిని వదిలేందుకు సిద్ధపడకపోతే బాంబులతో ఆ పరికరాలను నాశనం చేయాలని సూచించారు బైడెన్ మూర్ఖత్వంతోనే ఉపసంహరణ ప్రక్రియ ఇంత దారుణంగా, బలహీనంగా సాగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story