స‌ముద్రంలో మునిగిపోతోన్న వ్య‌క్తిని మాన‌వ హారంతో కాపాడిన‌ టూరిస్టులు.. వీడియో వైరల్

Tourists Rescue Drowning Tourist From Binmaley Beach
x

స‌ముద్రంలో మునిగిపోతోన్న వ్య‌క్తిని మాన‌వ హారంతో కాపాడిన‌ టూరిస్టులు.. వీడియో వైరల్

Highlights

Binmaley Beach: చూస్తుండగానే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని సాటి పర్యాటకులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Binmaley Beach: చూస్తుండగానే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని సాటి పర్యాటకులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిలిప్పీన్స్‌లోని బిన్మలే బీచ్‌లో అందరూ ఉల్లాసంగా గడుపుతుండగా ఓ పర్యాటకుడు అలల ఉధృతిలో చిక్కుకున్నాడు. ఇది గమనించిన మిగతా పర్యాటకులు వెంటనే మానవహారాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యక్తిని సేవ్ చేశారు. ఇదంతా క్షణాల్లోనే చేయడంతో ఆ వ్యక్తి క్షేమంగా బతికిబయట పడ్డాడు. మునిగిపోతోన్న వ్యక్తిని కాపాడ‌డానికి తోటి ప‌ర్యాట‌కులు అంతా క‌లిసి శ‌ర‌వేగంగా మాన‌వ హారం క‌ట్టి కాపాడిన తీరుపై ప్రశంస‌ల జ‌ల్లు కురుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories