ఇవాళ ‎ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

Ebrahim Raisi: రైసీ పుట్టిపెరిగిన మషాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహణ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2024 8:16 AM IST
Today is the funeral of President of Iran Ebrahim Raisi
X

ఇవాళ ‎ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించుకుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్ జెండాలు పట్టుకుని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఇవాళ రైసీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి భారత్ తరపున అధికారికంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన అధ్యక్షుడు, ఆ దేశ విదేశాంగ మంత్రికి భారత్ తరపున నివాళులర్పిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story