టెక్సాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగువారి మృతి

* ముగ్గురు తెలుగువారు మృతి * మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం * మృతులు నారాయణపేట వాసులుగా గుర్తింపు * హైదరాబాద్‌కు చెందిన సాయిప్రణీత్‌, లింగమనేని పరిస్థితి విషమం

Neeta Gurnale
Updated on: 29 Nov 2020 12:15 PM IST
టెక్సాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగువారి మృతి
X

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు నారాయణపేటకు చెందిన వారిగా గుర్తించారు

ప్రమాద బాధితులు మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామం. గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి హైదరాబాద్ లో ఆర్టీసీ ఉద్యోగి. ఈయన భార్య లక్ష్మి . మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం. వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. నాలుగు నెలలక్రితం వీరు పిల్లల దగ్గరకు వెళ్లారు.

అక్కడ శనివారం ఒక కుటుంబ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నర్సింహారెడ్డి..లక్ష్మి..భరత్ మృతి చెందారు. మోనిక..సాయిప్రణీత్ లు తీవ్రంగా గాయపడ్డారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో పెద్దచింతకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story