EGYPT: ఏంటి? ఒకప్పుడు భూమిపైన తిమింగలాలు తిరిగేవా? ఈజిప్ట్‌ తవ్వకాల్లో బయటపడ్డ తిమింగలం భారీ అస్తిపంజరం

EGYPT: ఏంటి? ఒకప్పుడు భూమిపైన తిమింగలాలు తిరిగేవా? ఈజిప్ట్‌ తవ్వకాల్లో బయటపడ్డ తిమింగలం భారీ అస్తిపంజరం
x
Highlights

EGYPT: ఈజిప్ట్ ప్రాచీన నాగరికతకు నిలువెత్తు నిదర్శనం. ఇదే పిరమిడ్ల దేశం కూడా. ఈ దేశంలో అన్నీ ఆసక్తి కరమైన విషయాలే ఉంటాయి.

EGYPT: ఈజిప్ట్ ప్రాచీన నాగరికతకు నిలువెత్తు నిదర్శనం. ఇదే పిరమిడ్ల దేశం కూడా. ఈ దేశంలో అన్నీ ఆసక్తి కరమైన విషయాలే ఉంటాయి. నిత్యం అక్కడ కొత్త కొత్త విషయాలను కనిపెట్టేందుకు పరిశోధకుల శోధనాలు చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను బయటపెడుతూనే ఉంటారు. తాజాగా ఒక పెద్ద ఆకారంలో ఉన్న అస్తిపంజరాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది తిమింగలం అస్తిపంజరం అని, భూమిపైన అది తిరిగేదని చెప్పారు. ఈ అధ్యయానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈపిప్ట్ దేశమంటే ఆసక్తికరం. పురాతన, సంప్రదాయలకు నెలవు. 5వేల సంవత్సరాల కలిగిన ఈ ప్రాంతం.. పిరమిడ్ల దేశం కూడా. ఈ దేశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు, పురాతన విశేషాలను తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా చూస్తారు. దానికోసం అక్కడ నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వారికి ఒక పెద్ద ఆకారంలో ఉన్న తిమింగలం అస్తిపంజరం దొరికింది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలను వెల్లడించారు.

తాజా అధ్యయనం ప్రకారం, ఈజిప్ట్‌లో ఉన్న సహారా ఎడారి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు సముద్రపు జీవులు ఉండేవని పరిశోధకులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అక్కడ ఇసుక మాత్రమే ఉంది. కానీ ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద సముద్ర జీవులు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఇలా చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది.. అదే ఆ ప్రాంతంలో ఇప్పడు వారికి ఒక పెద్ద అస్తి పంజరం దొరకడం. ఇది ఒక పెద్ద తిమింగలానికి చెందిన అస్తిపంజరమని వారు గుర్తించారు.

శాస్త్రవేత్తలు భారీ అస్తి పంజరం గుర్తించిన ప్రాంతాన్ని వాడి అల్ హితాన్ అని పిలుస్తారు. అంటే తిమింగలాల లోయ అని అర్ధం. ఇప్పుడు ఇక్కడే ఒక భారీ ఆకారపు తిమింగలం అస్తిపంజరం కనబడడంతో దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అయితే ఇది దాదాపు 40 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని ముక్కలను వరుసగా పేర్చుకుంటూ వెళితే చాలా దూరం ఉంది. ఈ అస్తిపంజరం దొరికిన తర్వాత మరింత లోతుగా తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో దాదాపుగా 400 తిమింగాల అస్తిపంజరాలు దొరికాయి.

ఈ తిమింగల అస్తిపంజరాలకు కాళ్లు, వేళ్లు కూడా ఉన్నాయి. ఇవి భూమిపైన ఒకప్పుడు తిరిగేవని, భారీ ఆకారంలో ఉండటం వల్ల కాస్త నెమ్మదిగా ఇవి నడిచేవని శాస్త్రవేత్తలు చెప్పారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని కొత్త విషయాలను తెలిసే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories